మాయలేడి వరుస పెళ్లిళ్లు !

Telugu Lo Computer
0


ప్రియుడితో కలిసి పరాయి మగాలను బుట్టలో వేసుకొని డబ్బులు కాజేస్తున్న మాయలాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు బాధితులు. వరుస పెళ్లిళ్లు చేసుకుంటు కోట్లలో నగదు కాజేస్తున్న విశాఖపట్నానికి చెందిన కిలాడీ లేడీ రేణుక మొదట జగదీశ్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి నాటికే ఆమె మూడు నెలల గర్భవతి అని తెలుసుకున్న జగదీశ్‌ ఆమెను వదిలేశాడు. పుట్టబోయే బిడ్డ సంరక్షణ పేరుతో జగదీశ్‌ వద్ద నుంచి లక్షల్లో నగదు ఫిక్స్‌డ్‌ డిపోజిట్‌ రూపంలో దోచుకుంది. ఇదిలా ఉండగా రేణుక ప్రియుడు శ్రీనివాస్‌ వేసిన స్కెచ్‌ ప్రకారం ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న అతని పిన్ని కొడుకైన ప్రసాద్‌ను సోషల్‌ మీడియా ద్వారా పరిచయం చేసుకుంది.  అనంతరం ప్రసాద్‌ను పెళ్లి చేసుకొని కాపురం పేరుతో లక్నో వెళ్లింది. కొద్దిరోజులకే జీవీఎంసీలో ఉద్యోగమొచ్చిందనే నెపంతో తిరిగి విశాఖపట్నం చేరుకుంది. ఈ కొద్దిరోజులలోనే తన తల్లికి అనారోగ్యమని చెప్పి వివిధ సందర్భాల్లో ప్రసాద్‌కు కోటి రూపాయల వరకు కుచ్చుటోపి పెట్టింది. చివరికి నిజాలు తెలుసుకున్న బాధిత భర్తలు తమకు న్యాయం చేయాలంటు పోలీసులను ఆశ్రయించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)