వానలు పడేటప్పుడు గానీ, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గానీ మధ్య తరగతి వాళ్ల స్నాక్స్ గా ఉపయోగపడేవి అప్పాలు. తెలంగాణ లో అన్ని మధ్య తరగతి కుటుంబాలు ఈ అప్పాలను చిరుతిండ్లకోసం ఉపయోగించుకుంటారు. ఇప్పుడు కూడా వంట ఇంట్లో డబ్బాల్లో చిరుతిండ్లు తినాలనుకున్నప్పుడు "ఏమన్న" కోసం వెదుక్కునేది. ఇప్పటికీ వెతుక్కుంటాం. అలా ఏమన్న చాయలోకి నంజుకు తింటే అమోఘం. ఇప్పుడు మధ్యతరగతి అప్పాలన్నీ పిండివంటలు, స్వగృహ సెంటర్లలో దొరుకుతున్నాయనుకొండి. మధ్యతరగతి వంటకాలు, దరిజేరని పేదల సర్వస్వం సర్వపిండి కూడా ఇప్పుడు అక్కడా దొరుకుతున్నది. నిజంగా సర్వ పిండి వానాకాలపు సాయంత్రాల్లో సర్వం అనిపిస్తుంది.
Post a Comment
0Comments
3/related/default