వి.రామకృష్ణ అసలు పేరు విస్సంరాజు రామకృష్ణదాసు 1970 వ దశకములో పేరొందిన తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. ఇరవై సంవత్సరాల సినీ జీవితంలో ఈయన 200 సినిమాలలో 5000కు పైగా పాటలు పాడారు. రామకృష్ణ పాటలు పాడిన కొన్ని చిత్రాలు తాతామనవడు, భక్తతుకారాం, శారద, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, ముత్యాల ముగ్గు, అందాలరాముడు, భక్త కన్నప్ప, దానవీరశూర కర్ణ, మహాకవి క్షేత్రయ్య, అమరదీపం, శ్రీమద్‌విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, శ్రీషిర్డీసాయిబాబా మహత్యం, బలిపీఠం, గుణవంతుడు, కరుణామయుడు. ఈయన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి నటులకు పాడారు. కె.వి.మహదేవన్, పెండ్యాల వంటి సంగీతదర్శకులతో పనిచేశారు. అపర ఘంటసాలగా పేరొందిన రామకృష్ణ తొలుత చెన్నైలో స్థిరపడినా ఆ తర్వాత తెలుగు చిత్ర సీమ తరలిరావడంతో వారితోపాటు తాను కూడా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. రామకృష్ణ దాదాపు 5000లకు పైగా పాటలు పాడారు. ఆయన పాడిన భక్తిగీతాల అల్బాలు విశేష ఆదరణ పొందాయి. తన సుమధుర గాత్రంతో ప్రేక్షకుల మదిలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. అమరగాయకుడు ఘంటసాల స్ఫూర్తితో సినీ రంగ ప్రవేశం చేసిన రామకృష్ణ 200 చిత్రాల్లో దాదాపు 5వేలకు పైగా గీతాలను ఆలపించారు. రామకృష్ణ, రంగసాయి, రత్నం దంపతులకు 1947, ఆగష్టు 20 న విజయనగరంలో జన్మించారు. గాయని పి.సుశీల ఈయనకు మేనత్త. నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. ఆకాశవాణి లోని యువవాణి కార్యక్రమంలో చిత్తరంజన్ దర్శకత్వంలో లలితగీతాలతో పాడటం ప్రారంభించారు. 1977లో ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రదర్శనలిచ్చి దూరదర్శన్ లో పాటలు పాడి, పేరుమోసిన గాయని జ్యోతి ఖన్నాను రామకృష్ణ పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. 2001లో నువ్వే కావాలి చిత్రంతో పేరుతెచ్చుకున్న యువనటుడు సాయి కిరణ్ వీరి అబ్బాయే. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడిన వీరు 2015, జూలై 16 న జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
వి.రామకృష్ణ
August 20, 2021
0