అక్టోబర్ 10న 'మా` ఎన్నికలు

Telugu Lo Computer
0


మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల తేదీ ఖరారైంది. అక్టోబరు 10న ఎన్నికలు నిర్వహించ నున్నట్టు సమాచారం. ఇటీవల ఆన్‌లైన్‌ వేదికగా మా సర్వసభ్య సమావేశం జరిగింది. మా కార్యవర్గ ఎన్నికల నిర్వహణ పై ప్రధానంగా ఈ చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే క్రమశిక్షణ కమిటీ ఎలా చెబితే అలా చేస్తామని ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్‌ కూడా తన అభిప్రాయాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా అక్టోబరు 10వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని మా క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇక అధ్యక్ష అభ్యర్థులు, వారి ప్యానెల్‌ సభ్యులు ప్రచారం ముమ్మరం చేయనున్నారు. ఇప్పటికే ప్రస్తుతం అధ్యక్ష బరిలో ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహారావు, హేమలు ఉన్నట్టు వారు ప్రకటించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)