గత కొన్ని రోజులుగా వేడి, ఉక్కపోతతో అల్లాడిన తెలుగు రాష్ట్రాల ప్రజలు కాస్త సేదదీరారు. పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురవగా దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ చల్లబడింది. పలు ప్రాంతాల్లోని రోడ్లు జలమయం అయ్యాయి.వర్షం కురిసే ముందు ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, గురువారం ఉదయం వరకు కూడా కొన్నిచోట్ల విద్యుత్ పునరుద్ధరణ కాలేదు. మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు దక్షిణ ప్రాంతం వరకు ఉపరితలద్రోణి ఏర్పడడం, మరోవైపు ఒడిశా నుంచి కోస్తాంధ్ర వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి ఏర్పడిన కారణంగానే తెలుగు రాష్ట్రాలలో ఈ వాతావరణం ఏర్పడగా, మరో రెండు రోజులు రెండు రాష్ట్రాలలో పలు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు.
Post a Comment
0Comments
3/related/default