కత్తి చికిత్సకు ప్రభుత్వ సాయం

Telugu Lo Computer
0


గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్‌ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం చెన్నైలో అపోలో ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం మహేశ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో మహేశ్‌ చికిత్స నిమిత్తం ఏపీ ప్రభుత్వం ఆర్థికసాయం అందించింది. రూ.17లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్‌ కింద చెన్నైలోని అపోలో ఆస్పత్రికి జమ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)