పెరిగిన బంగారం ధర !

Telugu Lo Computer
0


బంగారం ధర వరుసగా మూడో రోజు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.270 పెరగడంతో రూ.49,260కి చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.250 పెరిగి రూ.45,150కి చేరింది. వెండి ధరల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. కేజీ వెండిపై రూ. 600 పెరిగి రూ. 74,500కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 0.01 శాతం పెరిగింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1829 డాలర్లకు చేరింది. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. ఔన్స్‌కు 0.24 శాతం పెరుగుదలతో 26.45 డాలర్లకు ఎగసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)