డెల్టా వేరియంట్ వేగంగా విస్తరించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద దేశాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదవ్వడాన్ని గుర్తించామని అధనోమ్ తెలిపారు. కరోనా ప్రభావం మొదలయ్యాక ఇది అత్యంత ప్రమాదకర సమయమని హెచ్చరించారు. డెల్టా వేరియంట్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ భయానకంగా మారుతోందన్నారు. మహమ్మారి బారి నుంచి బయట పడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమన్నారు. వచ్చే ఏడాది ఈ సమయానికి ప్రతి దేశంలో ఆ దేశ జనాభాలో 70 శాతం మందికి టీకాలను ఇవ్వాలని సూచించారు. ఇందుకు అన్ని దేశాలు కలసికట్టుగా, పరస్పరం ఒకరికొకరు సహకరిస్తూ ముందుకెళ్లాలన్నారు.
వంద దేశాల్లో డెల్టా వేరియంట్
July 04, 2021
0