దర్శనాలు పునః ప్రారంభం

Telugu Lo Computer
0


అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సమాధి దర్శనం ఈరోజు నుంచి తిరిగి ప్రారంభం అయ్యింది. దాదాపు మూడు నెలల తరువాత బాబా వారి సమాధి దర్శనం తిరిగి ప్రారంభమవటంతో భక్తులు ఆనందిస్తున్నారు. ప్రశాంతి నిలయంలో నేటి నుంచి సత్యసాయి మహా సమాధి దర్శన భాగ్యం భక్తులకు కల్పిస్తున్నట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. మూడు  నెలల తర్వాత సత్యసాయి మహా సమాధి దర్శనం ప్రారంభం కావడంతో ప్రశాంతి నిలయం నూతన శోభను సంతరించుకుంది. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ప్రశాంతి నిలయాన్ని మూసివేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)