సేవ్‌ సినిమా సేవ్‌ థియేటర్‌

Telugu Lo Computer
0


జీవో నంబరు 75 (23-6-2017)ని పునః పరిశీలించాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ మేరకు ‘సేవ్‌ సినిమా సేవ్‌ థియేటర్‌’ నినాదంతో గురువారం ఓ లేఖని విడుదల చేసింది. థియేటర్‌ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆ లేఖలో పేర్కొంటూ, తగిన షరిష్కారం చూపాలని కోరింది. కొన్నాళ్లుగా థియేటర్లు నష్టాల బాటనే నడుస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ప్రేక్షకులు సినిమా హాళ్లకి రాకపోవడంతో ఆ నష్టం మరింత ఎక్కువైంది. దాంతో ఎగ్జిబిటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

G.O. Ms. No.75, dt. 23-06-2017ని పునః పరిశీలించాలి., సినిమా హాళ్లకి వచ్చే ప్రధాన ఆదాయ మార్గం పార్కింగ్‌ ఫీజు. దశాబ్దాలుగా థియేటర్లు పార్కింగ్‌కి కొంత ఫీజు వసూళ్లు చేశాయి. ప్రస్తుతం థియేటర్లలో పార్కింగ్‌ని ఉచితం చేయడంతో నష్టంవాటిల్లుతోంది. పైగా పార్కింగ్‌ సిబ్బందికి జీతం ఇవ్వాల్సిందే. కొవిడ్‌ నేపథ్యంలో శానిటైజర్లు తదితర వాటిని సమకూర్చాలి. వీటిని దృష్టిలో పెట్టుకుని నామమాత్రపు పార్కింగ్‌ ఫీజుకి అనుమతించాలి., గతేడాది లాక్‌డౌన్‌ నుంచి థియేటర్లన్నీ మూత బడ్డాయి. అయినా కనీస విద్యుత్తు ఛార్జీలు భరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మినిమమ్‌ డిమాండ్‌ ఛార్జీలను మాఫీ చేసి, ఎగ్జిబిటర్ల వ్యాపారాన్ని గాడిన పడేలా చేయాలి., గత రెండేళ్ల ప్రాపర్టీ ట్యాక్స్‌ని రద్దు చేస్తే లాక్‌డౌన్‌ కారణంగా వాటిల్లిన నష్టాల్ని పరోక్షంగా తీర్చినట్టవుతుంది., స్టేట్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (ఎస్‌.జి.ఎస్‌.టి)ని తొలగించాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)