గోరింటాకు అని అంటాము కానండి అసలు పేరు గౌరింటాకు అండి అంటే అర్థం గౌరి ఇంటి ఆకు .... అసలు ఈ గౌ(గో)రింటాకు కథ ఏంటో మీరు తెలుసుకోండి
పూర్వం గౌరీదేవి బాల్యంలో చెల్లెళ్లతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలతాకిన వెంటనే ఓ మొక్క పుడుతుంది. ఈవింతను చెల్లెల్లు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తారు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నా వలన ఈ లోకానికి ఏ ఉపయోగం కలదూ అని వారిని అడుగుతుంది. అపుడు పార్వతి(గౌరి) ఆచెట్టు యొక్క ఆకు కోస్తుంది. అప్పుడు ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి.
అయ్యో బిడ్డ చేయి కండిపోయినది అనుకునేలోపు గానే పార్వతి నాకు ఏ విధమైన బాధా కలుగలేదు
పైగా చాలా అలంకారంగా అనిపిస్తోందీ అని వారితో అంటుంది.
పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిధ్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈచెట్టు,స్త్రీలగర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతిఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తనవర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది.
అదే ఈ చెట్టు జన్మకు సార్ధకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లూ అందంగా తీర్చుకుంటు ఉంటారు.
ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటన కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో అని !!
అలా జరిగితే అపుడు నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో ఆ సందేహం చెప్పగా .... ఈ గౌరింటాకు నుదుటన ఎవరికీ పండదు అని అంటుంది. ( మీకు అనుమానం ఉంటే చూడండీ గోరింటాకు నుదుటన పండదు. )
ఇక శాస్త్రపరంగా చూస్తే గర్భాశయ దోషాలు తీసేస్తుంది.
అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాననాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంత పరుస్తుంది ఈ గోరింటాకు.
ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవంవలన ఏర్పడే గర్భాశయబాధలు నయం అవుతాయి.
ఇక భర్త కి గోరింటాకుకి ఒక అనుబంధం ఉంది
స్త్రీ లోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందు వలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడూ ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా....
పెద్దోళ్ళు ఏంచెప్పినా మరీ ఓ పది పన్నెండు మైళ్ల దూరదృష్టి తోనే చెబుతారండీ.
అపోహలేం కాదు. గోరింటి ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకూ అన్ని విధాలా ఆరోగ్యం ఆనందం.
సంవత్సరానికి ఒకసారి పుట్టింటికి పోతుందండోయ్. అంటే పార్వతి దగ్గరికి.
ఆషాఢమాసంలో అక్కడున్నపుడు కూడా తనను మరచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలనీ గోరింటాకు కోరిందట !