సుహాస్ 'కలర్ ఫోటో' సినిమాతో హీరోగా టర్న్ అయ్యాడు. కలర్ ఫొటో సినిమాతో సుహాస్ కి మంచి గుర్తింపు వచ్చింది. వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఒక వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే మరోవైపు హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు. సుహాస్ హీరోగా నటిస్తున్న తాజాగా చిత్రం 'ఫ్యామిలీ డ్రామా'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మంగళవారం విడుదలైంది. ఫ్యామిలీ డ్రామా' సినిమా క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందుతోంది. మెహర్ తేజ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఛాష్మ ఫిలిమ్స్, నూతన భారతి ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. 'ఫ్యామిలీ డ్రామా' అనే టైటిల్ కి భిన్నంగా ఈ పోస్టర్ ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.
ఈ సినిమాలో పూజా కిరణ్, శృతి నోరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్-సంజయ్ లు ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.