రాయలసీమ పెండ్లి ! (వ్యంగ్య కవిత)

Telugu Lo Computer
0


పాపది పలమనేరు

బాబుది బనగానపల్లె

పెండ్లి చూపులు పుట్టపర్తిలో

నిశ్చితార్థం నగరిలో

లగ్నపత్రిక రాయించింది లేపాక్షిలో

మరి పెండ్లి పెద్దలు ఎవరు?

చిత్తూరు నుండి చిన్నత్త

పుత్తూరు నుండి పెద్డత్త

మల్యాల నుండి మేనమామ

నంద్యాల నుండి నడిపిమామ

ఆదోని నుండి అబ్బ

తాడిపత్రి నుండి తాత

మరి పెండ్లి సామాన్లు ఎక్కడ కొనిన్నారు ?

బంగారు తాళికి ప్రొద్దుటూరు

నేత పంచెలకు ఎమ్మిగనూరు

పట్టుచీరలకి ధర్మవరం

తలంబ్రాలకు కర్నూలు బియ్యం

మరి పెండ్లి కొచ్చినోళ్లకు ఏం పెట్టినారు?
చిత్రాన్నం పప్పు

మదనపల్లి టమాటా ఊరిమిండి

గువ్వలచెరువు కోవా

పులివెందుల అరటిపండ్లు

కాలాస్త్రి పాలైసు

కడప బీడా

మరి పెండ్లి ఎలా చేసినారు ?

బేతంచర్ల నాపరాళ్ళ సప్పటేసి

పుంగనూరు కొబ్బరాకులతో పందిరేసి

అనంతపురం అయ్యవారు

తిరుమలలో అంగరంగ వైభవంగా పెండ్లిజేసినాడు

ఇట్టాంటి పెండ్లి ఏడేడు సీమల్లో యాడా జరగలేదని అందరూ అనుకుంటుండారు.
మీరు కూడా వధూవరులను ఆశీర్వదించండి !

Post a Comment

0Comments

Post a Comment (0)