సరిలేరు దీపిక కెవ్వరూ ... !
June 28, 2021
0
భారత మహిళా ఆర్చర్ దీపిక కుమారి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది. పారిస్‌లో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నమెంట్‌లో దీపిక ఏకంగా మూడు స్వర్ణలను సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తను ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ అద్భుత విజయాన్ని అందుకుంది. ముందుగా అంకిత భకత్, కోమలికతో కలిసి బరిలోకి దిగి పసిడి పతకం దక్కించుకుంది. మిక్స్‌డ్ విభాగంలో దీపిక తన భర్త అతాను దాస్‌తో కలిసి విజేతగా నిలిచింది. వ్యక్తిగత రికర్వ్‌లోనూ దీపిక స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఓకే ప్రపంచకప్ టోర్నీలో మూడు స్వర్ణాలు సాధించిన తొలి ఆర్చర్‌గా గుర్తింపు పొందింది.