గాంధీ మెచ్చిన "రత్నం"

Telugu Lo Computer
0


ఇప్పుడంటే బాల్ పెన్నులు వచ్చాయి గానీ గతంలో సిరా పెన్నులే వాడేవారు. వాటికి "రత్నం" పెన్నులు కంపెనీ ప్రసిద్ధి. వాటిని మెచ్చి గాంధీ గారు లేఖ రాయడం నిజంగా వారి అదృష్టం. 

మనిషికి తన భవిష్యత్తు తెలుసుకుందుకు అతని నుదుటి రాతలు ఎలాగూ కనపడవు. కానీ మనిషి యొక్క చేతి వ్రాతను బట్టి అతని భవిష్యత్తు లేదా గుణగణాలను కొంతమంది చెపుతుంటారు. అంటే బహుశా చాలా అందంగా చేతివ్రాత వ్రాసేవారి భవిష్యత్తు లేదా గుణగణాలు బాగా మంచిగా ఉంటాయేమో. మరి అందంగా చేతివ్రాత ఉండాలంటే మన చెయ్యే కాదు చేతిలో కలం కూడా మంచిది అయిఉండాలి. ఇప్పుడంటే బాల్ పెన్నులు వచ్చాయి కానీ పూర్వకాలంలో అందరూ సిరా పోసి వ్రాసుకునే కలాలనే వాడేవారు. అటువంటి కలంలో ముఖ్య పాత్ర వహించేది 

" పాళీ ". ఈ పాళీ సరైనది లేకపోతే ఎంత కష్టపడ్డా చేతివ్రాత అందంగా ఉండదు. ఈ పాళీని తయారుచేయడం కూడా ఓ పెద్దకళే. అంతటి ప్రత్యేకమయిన పాళీ గల కలాలను అలనాటి దేశ ప్రముఖులు నుండి నేటి తరంవరకు వాడినవారే. ఈ పాళీలను/కలాలను తయారు చేయగల దిట్ట ఎవరో కాదు మన రాజమండ్రి "రత్నం" పెన్నులు కంపెనీ వారు.  మహాత్మా గాంధీగారు రత్నంపెన్ను గురించి రత్నం గారికి 16-07-1935 న వ్రాసిన లేఖ చూడండి..

Post a Comment

0Comments

Post a Comment (0)