ఆనందయ్య మందు పంపిణీ షురూ !
June 06, 2021
0
ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం నుండి అనుమతి రావడంతో ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఔషధాన్ని ఇస్తున్నారు. ఈ ఔషధం కోసం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గంలో లక్షమందికి కరోనా రానివారు వాడే మందును అందజేయాలని ఆనందయ్య బృందం ఇప్పటికే నిర్ణయించింది. అనంతరం కరోనా రోగులకు అవసరమైన మందును పంపిణీ చేస్తారు. ఆ తర్వాతే ఇతర ప్రాంతాలకు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భముగా ఆనందయ్య మాట్లాడుతూ తొలుత సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంటింటికి ఔషధం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇతర ప్రాంతాల వారికి తరువాత ఇస్తామని, ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు.