స్వీడన్ ప్రధానమంత్రి స్టీఫెన్ లోఫ్‌వెన్తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 21న స్వీడన్ పార్లమెంట్ లో స్టీఫెన్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దాంతో ఆయన తన పదవికి రాజీనామా చేయడానికి స్పీకర్ వారం రోజులగడువు ఇచ్చారు. దీంతో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామా ప్రకటించారు. దీంతో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడంలో విఫలమై పదవిని పోగొట్టుకున్న తొలి ప్రధానిగా స్టీఫెన్ లోఫ్‌వెన్ నిలిచారు.
కొత్తగా నిర్మించిన అపార్ట్‌మెంట్లకు అద్దె నియంత్రణలను తగ్గించే ప్రణాళిక విషయంలో ప్రభుత్వానికి, దానికి మద్దతు ఇస్తున్న లెఫ్ట్ పార్టీకి మధ్య విభేదాలు వెలగుచూశాయి. దీంతో లెఫ్ట్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ప్రధానిగా స్టీఫెన్ లోఫ్‌వెన్ పదవికి అనర్హుడుగా ప్రకటించాలని లెఫ్ట్ పార్టీ డిమాండ్ చేసింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న స్వీడన్ డెమోక్రాట్స్(ఎస్.డి) పార్టీ పార్లమెంటులో ప్రధానిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మొత్తం 349 సీట్లు ఉన్న స్వీడన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 181 మంది చట్టసభ్యులు ఓటేశారు. ఫలితంగా 2014 నుంచి స్వీడన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న స్టీఫెన్ లోఫ్‌వెన్ తన పదవికి రాజీనామా చేశారు.