ప్రపంచంలో అత్యంత నివాసయోగ్య నగరం
June 10, 2021
0
ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. కరోనాను కట్టడి చేయడానికి ఎంత ప్రయత్నంచినా అది చేయాల్సి విధ్వంసం చేసేసింది. కరోనా మహమ్మారి ధాటికి యూరప్ దేశాలు అతలాకుతలం అయ్యాయి. ప్రపంచంలో నివాసయోగ్యమైన నగరాల జాబితాలో మొదటిస్ఠానంలో ఉండే యూరప్ దేశాలు ఈసారి వాటి స్థానలను కోల్పోయాయి. ఇక, కరోన కట్టడి విషయంలో కఠిన నిబంధనలు అమలు చేసి కరోనాకు చెక్ పెట్టిన న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని నగరాలు నివాసయోగ్యమైన నగరాల జాబితాలో చోటు సంపాదించాయి. ఇకపోతే, నివాసయోగ్యం కాని నగరాల లిస్ట్ లో సిరియాలోని డమాస్కస్ మొదటి స్థానంలో నిలిచింది. ఈసారి ఆరోగ్యవ్యవస్థల పనితీరును కూడా పరిగణలోకి తీసుకొన్నారు. ఈసారి నివాసయోగ్యమైన నగరాల జాబితాలో మొదటిస్ధానంలో న్యూజిల్యాండ్ రాజధాని అక్లాండ్ నిలిచింది. ఇక జపాన్ లోని ఒసాకా, ఆస్ట్రేలియా లోని అడిలైడ్, మెల్బోర్న్, పెర్త్, బ్రిస్బేన్, న్యూజిల్యాండ్ లోని వెల్లింగ్టన్, జపాన్ లోని టోక్యో, స్విజర్లాండ్ లోని జెనీవా మొదటి పది స్థానాలలో నిలిచాయి. 2018-2020 మధ్య ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యంగా ఉన్న వియన్నా ఈసారి ఏకంగా 12వ స్థానానికి పడిపోయింది.