ఆదిత్యనాథ్ దాస్ వెంకన్న దర్శనం

Telugu Lo Computer
0

\


ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన సతీసమేతంగా ఆదివారం తిరుమల శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. తొలుత సంప్రదాయం ప్రకారం ఆయన బాలాలయ వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల ఆలయానికి చేరుకుని ధ్వసస్తంభానికి మొక్కుకున్నారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ దంపతులకు పండితులు వేద ఆశీర్వాదం చేశారు. టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సీఎస్ కు స్వామివారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)