* ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు !
* అందని పూలు దేవుని కర్పణం !
* కమ్మరి వీధిని సూదులమ్మినట్లు !
* కుడితే తేలు కుట్టకపోతే కుమ్మరి పురుగు !
* హనుమంతుని ఎదుట కుప్పిగెంతులా!
* చల్ది కంటే ఊరగాయి ఘనం !
* ఉపన్యాసం కంటే ఉపోద్ఘాతం ఎక్కువు !
* ఇంట్లో ఈగలమోత బయట పల్లకీల మోత !
* ఆతండ్రికి కొడుకు కాడా!
* ఆ బుర్రలో విత్తనాలేనా?
* కాదు కాదు అంటే నాది నాది అన్నాట్ట !
* నంగివంగలు మేస్తే, నారికేళాలు దూడలు మేశాయి అన్నాడుట !
* మెసలి బావా కడిమి వేరాయెగాని కాలయినా ఇంతే కదా !
* ఆవుల మళ్ళించినవాడు అర్జునుడు !
* కాని కాలానికి పయిబట్ట పక్షులెత్తుకు పోయాయి !
