కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి ఏమిటి?

Telugu Lo Computer
0



న‌టుడు, ద‌ర్శ‌కుడ‌ు, సినీ విశ్లేష‌కుడు క‌త్తి మ‌హేష్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆయన స్నేహితులు,సన్నిహితులు ఆయన హెల్త్ కు సంభందించిన అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయ‌న ప‌రిస్థితి కాస్త ఆందోళ‌న క‌రంగానే ఉన్నా, భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని చెబుతున్నారు. అయితే ఈరోజు (సోమ‌వామ‌వారం) మధ్యాహ్నం ఆయ‌న‌కు ఓ కీల‌క‌మైన ఆప‌రేష‌న్ చేయ‌బోతున్నారు. Carniofacial reconstruction operation చేస్తున్నారని తెలిసింది. ముందు ఆ ఆపరేషన్ ద్వారా బోన్ స్ట్రక్చర్ reconstruct చేశాక కంటి ఆపరేషన్ ఆపరేషన్ చేస్తారు. కంటి చూపు సమస్య ఉండదనే నమ్మకంతో ఉన్నారు డాక్టర్స్. అయితే ఎడ‌మ కంటి చూపు పూర్తిగా పోయిన‌ట్టు వైద్యులు త‌మ‌కు చెప్పార‌ని క‌త్తి మేన‌మామ శ్రీ‌రాములు మీడియాకు స‌మాచారం ఇచ్చారు. త‌ల‌లో ర‌క్త‌స్రావం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ప్రాణాపాయం త‌ప్పిన‌ట్టు వైద్యులు చెప్పార‌న్నారు.

ఆపరేషన్ తర్వాత మనకి పూర్తి విషయాలు తెలుస్తాయి. ఇప్పటికైతే కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. ఈ ఆప‌రేష‌న్ విజ‌య‌వంత‌మైతే.. క‌త్తి మ‌హేష్ దాదాపుగా గ‌ట్టెక్కేసిన‌ట్టే. ప్ర‌మాదంలో ఆయ‌న మొహంపై తీవ్రమైన గాయాల‌య్యాయి. ద‌వ‌డ ఎముక చిట్లింది. క‌న్ను దెబ్బ‌తింది. నుదురు భాగంపైనా గ‌ట్టి దెబ్బే త‌గిలిందని సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)