పోలవరం పనులు ఆపాలి: మధు

Telugu Lo Computer
0


పునరావాసం పూర్తి అయ్యే వరకు పోలవరం ప్రాజెక్టు పనులు ఆపాలని సీపీఎం నేత మధు డిమాండ్ చేశారు. 1986 నాటి వరద ముంపు లెక్క తీసుకుని పోలవరం ముంపు గ్రామాలన్నింటికి ఒకేసారి పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలన్నారు. పునరావాసం పరిహారం కోసం కావాల్సిన నిధులన్నింటిని ఒకేసారి కేంద్రం చెల్లించేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల సహకారం తీసుకొని ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత వరద ముంపు నుండి ప్రజలను కాపాడే తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. జూలై నుండి డిసెంబర్‌ వరకు 6 నెలల పాటు ముంపుకు గురయ్యే ప్రతి కుటుంబానికి నెలకు రూ.7,500లు చెల్లించాలన్నారు. కొండలు, గుట్టలపై నివాసాలు ఏర్పర్చుకున్న వారికి ఆహారం, మంచినీరు, మందులు, టార్ఫాలిన్స్‌ వగైరా ఇవ్వాలని తెలిపారు. నిర్వాసితులు, వరద ముంపు సమస్యల పరిష్కరం కోస అన్ని రాజకీయ పార్టీలతోనూ చర్చిస్తామని చెప్పారు. ప్రభుత్వం తక్షణం నిర్వాసితులను అదుకోకపోతే ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని మధు హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)