* కల్లు త్రాగిన కోతిలా !
* ఎంత చెట్టుకి అంత గాలి !
* ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్లు !
* ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడు !
* ఏనుగులు మింగేవాడికి పీనుగలు ఓ లెక్క !
* ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యే !
* ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు !
* ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య !
* అంచు డాబే కాని, పంచె డాబు లేదు !
* అంత్య నిష్ఠూరం కన్నా, ఆది నిష్ఠూరం మేలు !
* కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా?
* కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది !
* కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం !
* కాకి పిల్ల కాకికి ముద్దు !
* కాగల కార్యం గంధర్వులే తీర్చారు !
