ప్రస్తుత పార్లమెంట్ భవనం 1927లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం తమ వలస పాలన కోసం కట్టింది. మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అదే బిల్డింగ్ ని పార్లమెంట్ కోసం వాడుకోవడం మొదలుపెట్టాము. ఇప్పుడున్న పార్లమెంట్ భవనం 1920 లలో కట్టడం మొదలు పెట్టి 1927 లో పూర్తయి వాడుకలోకి వచ్చింది . 1947లో స్వాతంత్ర్యం వచ్చినా మొదటి పార్లమెంట్ సమావేశాలు జరిగినది 1952 లో. 1952 లో మొత్తం పార్లమెంట్ స్థానాల , సభ్యుల సంఖ్య 489. అప్పట్లో ప్రతి 10 లక్షల జనాభాకి ఒక ఎంపీ ఉండేవారు. ఒక కోటి జనాభాకి 10 మంది ఎంపీలు ఉండేవారు. 1951 జనాభా లెక్కల ప్రకారం అప్పటి భారత దేశ జనాభా 36 కోట్లు. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాలని పునర్విభజించాలి కానీ 1977 లో మాత్రమే ఆ పని చేశారు అంటే 1977 లో ఎంపి స్థానాలు 543 కి చేరుకున్నాయి కానీ అప్పటి నుండి ఇప్పటివరకు పార్లమెంటు నియోజకవర్గ పునర్విభజన జరగలేదు. 1977 లో అప్పటి ప్రధాని ఇందిర 42వ రాజ్యాంగ సవరణ చేసి 2001 వరకు జనాభా లెక్కల సేకరణ చేసినా పార్లమెంట్ స్థానాల మీద తాత్కాలిక నిషేధం విధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి జనాభా లెక్కల సేకరణ తరువాత విధిగా పార్లమెంట్ స్థానాలని అప్పటి జనాభా కి తగ్గట్లుగా పెంచాలి కానీ ఇందిరా చేసిన చట్ట సవరణ వల్ల అది సాధ్యం కాలేదు.
1977 తరువాత 2001 లో అప్పటి వాజపేయ్ ప్రభుత్వం 82 వ సవరణ ద్వారా పునర్విభజన ని 2026 వరకు పొడిగించింది అంటే 2026 వరకు నియోజకవర్గ పునర్విభజన చేయడానికి లేదు.
వివిధ కార్యాలయాలు ఒకే చోట కాకుండా వేరే వేరే చోట్ల ఉండడం వలన అసౌకర్యంగా మారింది. అలాగే ప్రస్తుత డిజిటల్ యుగంలో పాత భవనంలో మార్పులు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు చేసినా కేబుల్స్ అన్నీ బయటికి కనపడేలా ఉంటాయి .
సెంట్రల్ విస్టా భవనానికి 2019 నవంబర్ 10 న శంఖుస్థాపన చేయాల్సి ఉండగా సుప్రీం కోర్టు స్టే విధించడంతో ఆగిపోయింది ఇప్పుడు సుప్రీ కోర్టు కొత్త భవనం కట్టడానికి అనుమతి ఇచ్చింది.
* సెంట్రల్ విస్టా అంటే ఏమిటి ? రాష్ట్రపతి భవన్ నుండి పార్లమెంట్ హౌస్, నార్త్ అండ్ సౌత్ బ్లాక్, ఇండియా గెట్, నేషనల్ ఆర్కైవ్స్ మరికొన్ని కలిపి 3.2 కిలోమీటర్ల స్ట్రెచ్ ని సెంట్రల్ విస్టా అంటారు. ఇవన్నీ 1927 నుండి 1931 మధ్య కట్టిన భవనాలు.
* ప్రస్తుత పార్లమెంట్ భవనం మధ్యప్రదేశ్ లోని 'చౌసాత్ యోగిని మందిరం' చూసి బ్రిటీష్ ఇంజినీర్లు ఎడ్విన్ ల్యూటెన్ మరియు హెర్బర్ట్ బేకర్ డిజైన్ చేశారు
* పాత భవనం కంటే కొత్త భవనం 17,000 చదరపు మీటర్ల పెద్దది. భూకంపాలని తట్టుకునే విధంగా డిజైన్ చేశారు. మొత్తం 64,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త భవనాలు కడుతున్నారు.
* కొత్త పార్లమెంట్ భవనం అంచనా వ్యాయం 971 కోట్లు. టాటా ప్రొజెక్ట్స్ లిమిటెడ్ టెండర్ వేసి దక్కించుకుంది. 2022 కల్లా పూర్తి చేస్తుంది. 2024 కల్లా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ పూర్తి అయిపోతుంది.
* కొత్త పార్లమెంట్ భవనానికి మొత్తం 6 ప్రధాన ద్వారాలు ఉంటాయి. 1. సెరిమోనియల్ ఎంట్రన్స్ రాష్ట్రపతి, ప్రధాన మంత్రి లకి మాత్రమే. 2. లోకసభ స్పీకర్ . 3. రాజ్యసభ స్పీకర్. 4 పార్లమెంట్ సభ్యులకి . 5, 6, పబ్లిక్ కోసం.
* మొత్తం 4 ఫ్లోరలతో కడుతున్నారు. 1. లోయర్ గ్రౌండ్ 2. అప్పర్ గ్రౌండ్ 3. ఫస్ట్ ఫ్లోర్ 4. సెకండ్ ఫ్లోర్. మొత్తం 120 ఆఫీసులుంటాయి వీటిలో కమిటీ రూములు, పార్లమెంట్ అఫైర్స్ ఆఫీస్ , లోకసభ , రాజ్యసభ సెక్రటేరియట్స్, ప్రధానమంత్రి కార్యాలయం, సభ్యులకి ఆఫీసులు , స్టాఫ్ క్వార్టర్స్ , భద్రతా సిబ్బంది క్వార్టర్స్ కూడా లోపలే ఉండబోతున్నాయి.
* లోకసభ ఛాంబర్ లో 888 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా కడుతున్నారు. రాజ్యసభ ఛాంబర్ లో 354 మంది సభ్యుల కోసం కడుతున్నారు. ఉభయ సభల జాయింట్ సమావేశాలకోసం మొత్తం 1224 మంది సభ్యలు కూర్చునేందుకు వీలుగా కడుతున్నారు.
* ఇక సభ్యుల ఫర్నిచర్ విషయానికి వస్తే అంతర్గతంగా అంటే మాడ్యూలర్ లాగా డిజిటల్ డిస్ప్లే ,వోటు వేయడానికి బయోమెట్రిక్ సిస్టమ్ , డిజిటల్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ మరియు ట్రాన్స్లేషన్ రికార్డింగ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్ , ప్రోగ్రామబుల్ మైక్రో ఫోన్ సదుపాయాలు కల్పిస్తున్నారు.