కరోనా వచ్చిందని ఆందోళన చెందేకంటే ఆరోగ్యాని ఎంత భద్రంగా ఉంచుకోవాలో ఆలోచించటం ముఖ్యం. వ్యాధుల బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ముఖ్యం. మంచి అలవాట్లతో దీనిని మెరుగుపర్చుకోవాలి.
మనం తీసుకొనే ఆహారం సమతుల్యత లోపించకూడదు. మనం తీసుకొనే ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు, పప్పు ధాన్యాలు, గింజలు, పాలు, పెరుగు, గుడ్లు, ఎండు ఫలాలతో కూడి ఉండాలి. రోగ నిరోధక శక్తి మెరుగుపడాలంటే ప్రోటీన్ అవసరమే. అలాగని గుడ్లు, మాంసం మితిమీరి తీసుకోకూడదు. మితిమీరితే జీర్ణ క్రియపై భారం ;పడుతుంది. సొయా, సెనగలు, రాజామ, పప్పు ధాన్యాలలో కూడా ప్రోటీన్ ఉంటుంది. వాటిని తీసుకోవచ్చు.
రోగ నిరోధక శక్తి మెరుగుపడాలంటే ఖరీదైన ఆహారమే తీసుకోవల్సిన అవసరం లేదు. ఉదయం టీ / కాఫీ తీసుకొనేబదులు అల్లం, పసుపు, జీరా, మిరియాలు, కాస్త ధనియాలు, వాము/వామాకు లను ఒక లీటరు నీటిలో మరిగించి తాగండి జీర్ణ క్రియను వేగవంతము చేయడమే కాదు. రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
విటమిన్ డి ఆహారములో తగినంత దొరకదు. ఏదీ సూర్యరష్మి ద్వారా లభిస్తుంది. అందువలన తప్పనిసరిగా ఎండపొడ మన శరీరానికి తగలనియాలి . తీసుకొన్న ఆహారానికి అనుగుణంగా రోజువారీ వ్యాయామము చేయాలి.
ఉదయం బొండాలు, దోషాలు, పూరీలు కాకుండా తేలికగా జీర్ణమైయే ఇడ్లీ , ఆవిరి కుడుములు లాంటి తేలికగా జీర్ణమైయే వాటిని తీసుకోవాలి. వీటితో ఒక కప్పు కొబ్బరి చెట్నీ తీసుకోండి. నానబెట్టిన గుప్పెడు బాదం పప్పు కూడా తీసుకోండి. స్త్రీ లకు కావలసిన క్యాలీషియమ్ అందుతుంది.
జంక్ ఫుడ్, కూల్ డ్రింకులు వంటి వాటికి దూరంగా ఉండండి.
