దట్ ఇజ్ హెల్త్ సిస్టమ్!

Telugu Lo Computer
0

డాక్టర్ల దగ్గరకు రావడం కాదు. డాక్టర్లే రోగి దగ్గరకి వస్తే ఎంత బాగుండు అని మనకి అనిపిస్తుంది. ఆ ఆలోచన మనకి వచ్చే ఛాన్స్ ఉందా ..?. 
మన తెలుగు రాష్ట్రాల్లో రానే రాదు. పోనీ ఉత్తరప్రదేశ్ , గుజరాత్ లో ఎవరైనా చేయగలరా ? అంటే ఎవరు చేయరు. అసలు ఈ రాష్ట్రాల్లో నే కాదు ఏ రాష్ట్రంలోనైన ఊహించడం కష్టమే! 
వాగులు, వంకలు దాటి, రోడ్లు లేని గూడేలకు ఏ డాక్టరైనా వస్తారా అంటే అది మరీ ఇట్లాంటి ఊహముచ్చట్లు వద్దులే అనుకోవడం చాలా సహజం.
కానీ అక్కడ సాధ్యం. ఊహ కూడా నిజం చేసే పాలకుల చిత్తశుద్ధి ఉంది. అక్కడ డాక్టర్లు రోగి దగ్గరకే వచ్చారు. రావడం అంటే అట్లా ఇట్లా కాదు వాగులు ,వంకలు దాటి మారుమూల పల్లెలకు రోగి దగ్గరికి చేరారు. కరోనా రోగులకు మందులిచ్చి ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ వస్తామని కూడా చెప్పి వెళ్లారు. అదే ఎక్కడా అని బుర్ర బద్దలు కొట్టుకొనవసరం లేదు.అదే కేరళ.  దట్  ఇజ్ కేరళ హెల్త్ సిస్టమ్. 






Post a Comment

0Comments

Post a Comment (0)