ఈ నెల 28న ఓ జంట కారులో వెళుతుండగా... బలరామ్‌పూర్ వద్దకు రాగానే ఇద్దరు వ్యక్తులు నదిలోకి ఓ శవాన్నివిసిరేస్తున్న దృశ్యాన్ని చూసి వీడియో తీశారు. అందులో ఒకరు పిపిఇ కిట్ ధరించ ఉండగా, మరొకరు సాధారణ దుస్తుల్లో ఉన్నారు. వీరిద్దరు ఒక శవాన్ని బిడ్జి మీద నుండి గంగా ఉపనది రాప్తిలోకి పడేస్తున్నట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ మృత దేహం కోవిడ్ రోగిదేనని బలరామ్‌పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ విబి సింగ్ ధ్రువీకరించారు.
ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టగా మే 25న కోవిడ్‌తో ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేరగా... 28వ తేదీన మరణించారు. కోవిడ్ ప్రోటోకాల్‌ననుసరించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించామని చీఫ్ మెడికల్ అధికారి తెలిపారు. అనంతరం ఆ మృతదేహాన్ని వారు నదిలో పడేశారని, వారిపై కేసు నమోదు చేశామని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతుని కుటుంబ సభ్యులే నదిలో పడేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బంధువులపై కేసు నమోదైందని చెప్పారు.
ఇటీవల గంగానది ఒడ్డుకు గుట్టలుగా శవాలు కొట్టుకురావడంపై కలకలం సృష్టించిన సంగతి విదితమే. ఇవన్నీ కూడా కోవిడ్ రోగులవేనని నిర్ధారించారు.
ఈ నెల మొదట్లో బీహార్, ఉత్తరప్రదేశ్ గంగా నది ఒడ్డుకు పలు మృతదేహాలు కొట్టుకువచ్చిన సంగతి తెలిసిందే. బుక్సర్‌లో సుమారు 71 శవాలు రావడంపై అక్కడి ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా గంగానదిలో ఇసుక తిన్నెల్లో వేలాది శవాలు బయట పడటం కలకలం సృష్టించింది. ఈ మృతదేహాలు మీ వంటే మీమని ఉత్తరప్రదేశ్, బీహార్‌ల మధ్య వివాదం కూడా నెలకొంది. ఇది కేంద్రం దృష్టికి వెళ్లడంతో నదుల్లో కోవిడ్‌తో చనిపోయిన మృతదేహాలను నదుల్లోకి విసరవద్దని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. నది ఒడ్డున పెట్రోలింగ్ పెంచాలని సూచించింది.
