టీకా తీసుకుంటే బీరు ఉచితం

Telugu Lo Computer
0


మాములుగా ఏ దేశంలోనైనా ఎన్నికలప్పుడు వరాల వర్షము కురుస్తుంది. కానీ దానికి భిన్నంగా అమెరికాలో వ్యాక్సిన్ వేయించుకొనేందుకు ప్రోత్సహకంగా ఆఫర్ల వర్షం కురుస్తుంది. 

దేశంలో వ్యాక్సినేషన్  వేగం పెంచేందుకు  చేసేందుకు ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ వ్యాక్సిన్లను సమకూర్చుకొని, వేగంగా ప్రజలకు ఇవ్వడం మొదలుపెట్టిన  ఆ దేశంలో ఉన్నట్టుండి గత కొద్దీ వారాలుగా ఒక్కసారిగా వ్యాక్సిన్ డిమాండ్ పడిపోయింది. ఏప్రిల్ రెండో వారంలో రోజుకు 32 లక్షల మంది టీకా వేసుకోగా, చివరి వారానికి 25 లక్షలకు తగ్గింది. దీంతో రాష్ట్రాలు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు జనం టీకా వేసుకునేలా ఆఫర్లు ఇస్తున్నాయి.   

టీకా వేసుకున్నోళ్లకు కొన్ని బ్రూవరీల్లో ఫ్రీగా బీర్ ఇస్తున్నారు. డెట్రాయిట్ నగరంలో ఎవరినైనా వ్యాక్సిన్ సెంటర్ దగ్గరికి తీసుకొస్తే 50 డాలర్లు (రూ.3,698) ఇస్తున్నారు. సెలూన్ షాపులలో ఫ్రీ సర్వీస్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వెస్ట్ వర్జీనియాలో టీకా వేసుకుంటే 100 డాలర్లు (రూ.7,396) విలువైన సేవింగ్ బాండ్స్ ఇస్తున్నారు. అలాస్కాలో నార్టన్ సౌండ్ హెల్త్ కార్ప్ ప్రైజులతో పాటు ఎయిర్ లైన్ టికెట్లు ఇస్తోంది. సరుకులు కొనుక్కునేందుకు 500 డాలర్లు గానీ, పెట్రోల్ గానీ ఉచితమని చెప్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)