కరోనా రెండవ దశలో 550 మంది వైద్యులు మృతి చెందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలియజేసింది. మొదటి దశలో 748 మంది వైద్యులను మహమ్మారికి బలైనట్లు తెలిపింది. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చని ఐఎంఏ భావిస్తున్నది. మూడున్నర లక్షల మంది డాక్టర్లు దీనిలో సభ్యులుగా ఉన్నారు. దేశం మొత్తం మీద 12 లక్షల మందికి పైగా డాక్టర్లు ఉన్నారని, వైద్యులు పూర్తి స్థాయిలో టీకాలు తీసుకోక పోవడం వలన కూడా అధిక మరణాలు సంభవించి వుండవచ్చని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జేఏ జయలాల్ అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ లో 104 మంది, బీహార్ లో 96 మంది, ఉత్తరప్రదేశ్ లో 53 మంది , రాజస్థాన్ లో 42 మంది, గుజరాత్ లో 31మంది, ఆంధ్రప్రదేశ్ లో 29 మంది, తెలంగాణా లో 29, పశ్చిమ బెంగాల్ లో 23 మంది, తమిళనాడు లో 21 మంది వైద్యులు చనిపోయినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలియజేసింది.