రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ వర్గాలు ఊహించినట్లే ఈసారి రెపో రేటును మార్చకుండా స్థిరంగా ఉంచింది. ఇప్పటికే ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్లో జరిగిన మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను 100 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఆగస్టులో జరిగిన సమావేశంలో వడ్డీరేట్లను స్థిరంగా ఉంచారు. సెప్టెంబర్ 29న ప్రారంభమైన ఎంపీసీ అక్టోబర్ 1న ముగిసింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అందులోని అంశాలను పేర్కొన్నారు. రెపో రేటును 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు చెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠ స్థాయిలోనే ఉంది. భారతీయ ఎగుమతులపై అమెరికా సుంకాలు సహా మునుపటి కోతలు, ప్రపంచ అనిశ్చితుల ప్రభావాన్ని అంచనా వేయాలని ఆర్బీఐ భావిస్తుంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో లోన్ ఈఎంఐలు ప్రస్తుతానికి నిలకడగా ఉండే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ వృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణ నేతృత్వంలోని అంతరాయాల నుంచి వచ్చే ప్రమాదాలపై విధాన నిర్ణేతలు జాగ్రత్త వహించినట్లు తెలుస్తుంది.
ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథం
October 01, 2025
0
Tags