బెంగళూరులో విద్యార్థిని దారుణ హత్య !

Telugu Lo Computer
0


బెంగళూరులోని శ్రీరాంపూర్ రైల్వే ట్రాక్ సమీపంలో పట్టపగలు యామిని ప్రియ అనే 20 ఏళ్ల విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ప్రేమ పేరుతో ఆమె వెంటపడి వేధిస్తున్న ప్రేమోన్మాది ఆమెను అత్యంత దారుణంగా అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై గొంతు కోసి చంపేశాడు తీవ్ర రక్తస్రావం కావడంతో యామిని స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయింది. బనశంకరిలోని ఒక కళాశాలలో బి ఫార్మసీ చదువుతున్న ఆమె ఈ ఉదయం కళాశాలకు వెళ్లడానికి స్వాతంత్య్రపాల్యలోని తన ఇంటి నుంచి బయలుదేరింది. మధ్యాహ్నం కళాశాల నుంచి పరీక్షలు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. మల్లేశ్వరంలోని మంత్రి మాల్ సమీపంలో రైల్వే ట్రాక్ వైపు ఆమె నడుచుకుంటూ వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన విఘ్నేష్ ఆమెను గొంతు కోసి హత్య చేసి పారిపోయాడు. యామిని పరీక్షలు రాసి కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమెను హత్య చేసిన నిందితుడిని విఘ్నేష్గా గుర్తించిన పోలీసులు అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. స్వాతంత్య్రపాళ్యంలో నివసించే విఘ్నేష్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా యామిని ప్రియను వెంబడిస్తూ తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేస్తున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది. ఒకసారి, అతను ఆమెకు బలవంతంగా తాళి కట్టాడు. ఇష్టం లేని యామిని తన ప్రేమికుడి తాళిని తెంచి దూరంగా ఉంచింది. గతంలో మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో విఘ్నేష్​పై దొంగతనం కేసు కూడా నమోదైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)