తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు కోసం దళారులు, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దంటూ ఎక్స్ లో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పోస్ట్ పెట్టారు. మధ్యవర్తులు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి భక్తులను మోసం చేసిన అనేక సందర్భాలు కూడా బయటపడ్డాయని వారికి గుర్తుచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తమ దర్శన టిక్కెట్లను బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు. దర్శనం లేదా వసతి కోసం ఏ మధ్యవర్తులను సంప్రదించవద్దని భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు. భక్తులను మోసం చేస్తున్న దళారీలను గుర్తించి వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి టీటీడీ ప్రత్యేక డ్రైవ్‌ను నడుపుతోందన్నారు. మధ్యవర్తులు, దళారీలు సంప్రదిస్తే విజిలెన్స్ మరియు పోలీసుకు ఫిర్యాదు చేయాలని భక్తులను అభ్యర్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే తిరుమలను శుభ్రంగా, సురక్షితంగా ఉంచడానికి అందరూ చేతులు కలుపుదామని టీటీడీ ఛైర్మన్ పిలుపునిచ్చారు.
దళారులు, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు !
October 18, 2025
0
Tags