ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా బీఎన్ కండ్రిగ ఎమ్మార్వో ఆఫీసులో పల్లమాలకు చెందిన పాండు అనే వ్యక్తి ఎంఆర్వో సమక్షంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తమ ఐదెకరాల భూమిపై గొడవలు జరుగుతున్నాయని, ప్రస్తుతం దీనిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయన్నారు. అయితే, ఈ నెల 8వ తేదీ వరకు తన తల్లి వదప్పగారి అనసూయమ్మ పేరు మీద ఉన్న భూమి ఇప్పుడు బి.రవీంద్రబాబు పేరు మీదకు ఎలా మారిందంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో ఎమ్మార్వో అక్కడే ఉండడంతో ఆయన సమక్షంలోనే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్థానికులు అడ్డుకున్నారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యం అన్నాడు. అయితే, అధికారులు ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి న్యాయం చేస్తామన్నారు.
తమ పేరుపై ఉండాల్సిన భూమి మరో వ్యక్తి పేరు మీదకు మారిపోవడంతో ఎమ్మార్వో ఎదుట బాధితుడి ఆత్మహత్యాయత్నం !
October 18, 2025
0
Tags