రాగి సంకటిలో బొద్దింక : ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడాలోని కృతుంగ రెస్టారెంట్‌‎కు ఈరోజు ఓ కస్టమర్ తినడానికి వెళ్ళాడు అతడు రాగి సంకటి ఆర్డర్ చేశాడు. రాగి సంకటి సగం తిన్న తర్వాత అతడికి దానిలో బొద్దింక కనిపించింది. దాంతో ఆ కస్టమర్ ఒక్కసారిగా షాక్‎ కు గురయ్యాడు. రాగి సంకటిలో బొద్దింక రావడంపై హోటల్ సిబ్బందిని అతడు ప్రశ్నించాడు. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. కృతుంగలో అత్యంత దారుణంగా కిచెన్ పరిసరాలు ఉండడాన్ని గమనించాడు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్ నుంచి దుర్వాసన కూడా రావడంతో సదరు కస్టమర్‎ కు చిర్రెత్తుకొచ్చింది. సిబ్బంది నిర్లక్ష్యం, కిచెన్ పరిసరాలపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాగి సంకటిలో బొద్దింక ఉన్న ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి చూసిన రెగ్యులర్‌గా కృతుంగ రెస్టారెంట్‌‎కు వెళ్లే కస్టమర్స్ విషయం తెలిసి షాక్ అవుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)