పశ్చిమ బెంగాల్ లోని జల్ పాయ్ గురిలో బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ముపై ప్రజలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఎంపీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగింది. నార్త్ బెంగాల్ లో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. దీంతో అతడ్ని స్థానిక ప్రజలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ముర్ము తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ఘటనపై అధికార టీఎంసీ పార్టీపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రజలు వరదలు, కొండచరియలు విరిగిపడి ఆందోళనతో ఉన్న సమయంలో వారికి అండగా నిలుస్తూన్న బీజేపీ నేతలపై దాడులకు పాల్పడుతోందని మండిపడింది. పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర మాల్దాకు చెందిన బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము.. మాల్దాలో ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. అయితే తాజాగా ఉత్తర బెంగాల్ లో ముర్ము పర్యటించిన నేపథ్యంలో స్థానికులు రాళ్లతో అతడిపై దాడికి పాల్పడ్డారు. జల్ పాయ్ గురిలోని దోవర్స్ ప్రాంతం నుంచి నగ్రాకటా ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో ఈ దాడి జరిగింది. ముర్మును చూసిన స్థానికులు అతడి కాన్వాయ్ పై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో అతడి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. అతడి షర్టు మొత్తం రక్తంతో ఉంది. అయితే ఈ దాడిని బీజేపీ ఖండించింది. తమ పార్టీ నేతలపై టీఎంసీ దాడులకు పాల్పడుతోందని మండిపడింది. దాడి ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ విభాగం "బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. గిరిజన నేతగా మంచి గుర్తింపు ఉంది. ఆయన వరద బాధితులను పరామర్శించేందుకు నగ్రాకటా వెళ్తుండగా టీఎంసీ వారు అతడిపై దాడికి పాల్పడ్డారు. ప్రజలు వరదలు, కొండ చరియలు విరిగిపడి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం కోల్ కతా కార్నివాల్ లో సంతోషంగా పాల్గొంటున్నారు. బీజేపీ మాత్రమే ప్రజలకు సాయం చేస్తోంది" అని ఎక్స్ లో పోస్టు చేసింది. ఉత్తర బెంగాల్ లో వరదల కారణంగా ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. డార్జీలింగ్, జల్పాయ్ గురి ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ముర్ము ఘటనపై వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించలేదు. ఈ ఘటనతో రాష్ట్రంలో రాజకీయ వాతవారణం మరోసారి వేడెక్కనుంది.
వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ ఎంపీపై ప్రజలు రాళ్ల దాడి !
October 06, 2025
0
Tags