ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినిపై స్నేహితుడు అత్యాచారం : నిందితుడు జీవన్ గౌడను అరెస్ట్

Telugu Lo Computer
0


క్షిణ బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ క్యాంపస్‌లోని పురుషుల టాయిలెట్‌లో సహచర విద్యార్థిని (21)పై స్నేహితుడు జీవన్ గౌడ అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్టోబర్ 10న కళాశాల ఏడవ అంతస్థులో బాధితురాలతో జీవన్ గౌడ మాట్లాడుతుండగా ఆమె ఆరవ ఫ్లోర్‌కు దిగేసింది. వెంటనే అతడు కూడా కిందకు దిగి పురుషుల బాత్రూమ్‌లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే పరువు పోతుందన్న భయంతో ఆమె ఎవరికీ చెప్పుకోలేదు. తాజాగా ఆమె తన మహిళ స్నేహితులతో పంచుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదు రోజుల తర్వాత స్నేహితుల సలహా మేరకు అక్టోబర్ 15న పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64 (అత్యాచారానికి శిక్ష) కింద కేసు నమోదు చేసి నిందితుడు జీవన్ గౌడను అరెస్ట్ చేశారు. బాధితురాలు-నిందితుడు ఒకరినొకరు తెలుసున్నవాళ్లేనని, కొన్ని వస్తువుల కోసం జీవన్‌ గౌడను బాధితురాలు కలిసిందని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 10న భోజన విరామ సమయంలో ఆమెకు చాలాసార్లు ఫోన్ చేసి ఏడవ అంతస్తులోని ఆర్కిటెక్చర్ బ్లాక్ దగ్గరకు వచ్చి కలవమని కోరాడు. ఆమె అక్కడికి రాగానే బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె లిఫ్ట్ ఉపయోగించి బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా ఆమెను ఆరవ అంతస్తు వరకు అనుసరించి పురుషుల వాష్‌రూమ్‌లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. లైంగిక దాడి సమయంలో నిందితుడు వాష్‌రూమ్ తలుపు లాక్ చేసి ఆమె ఫోన్ మోగినప్పుడు లాక్ చేసాడని నివేదికలో పేర్కొన్నారు. లైంగిక దాడి మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 గంటల మధ్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత ప్రాణాలతో బయటపడిన మహిళ తన ఇద్దరు స్నేహితులకు చెప్పింది. ఇక జీవన్ గౌడ బాధితురాలికి ఫోన్ చేసి ''మాత్ర అవసరమా'' అని అడిగినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. బాధితురాలు మొదట్లో ఫిర్యాదు చేయడానికి సంకోచించిందని, ఆమె భయపడి బాధపడినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత తల్లిదండ్రులకు సమాచారం అందించగా హనుమంతనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక గురువారం సంఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. సంఘటన జరిగిన ప్రదేశంలో ఎటువంటి సీసీటీవీ కెమెరాలు లేనట్లుగా గుర్తించారు. దీంతో ఆధారాలు లభించలేదు. ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)