ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అధికారిక నివాసంలో పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. వివేకానందరెడ్డి హత్య తరహాలో మళ్లీ నేరాలు, ఘోరాలు చేసి ఏపీలో అలజడి సృష్టించేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలని, వైసీపీ వాళ్ల క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మూర్ఖుడు, క్రూరుడు లాంటి పదాలు జగన్, ఆయన అనుచరులకే వర్తిస్తాయని అన్నారు. జగన్ నేర కార్యకలాపాలు అనంతమని, రాష్ట్రంలో ఆయన పార్టీ అంతా క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డాగా మారిందని విమర్శించారు. వైసీపీ నేతలు నేరాలు చేసి, వాటిని తెలుగుదేశం మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. కల్తీ మద్యం దర్యాప్తులో లోతుగా వెళ్తున్న కొద్దీ అనేక విషయాలు బయటపడుతున్నాయని, వాళ్ల నేరాన్ని తెలుగుదేశం మీదకు నెట్టేందుకు అన్నివిధాలా ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.
నేరాలు, ఘోరాలు చేసి ఏపీలో అలజడి సృష్టించేందుకు జగన్ ప్రయత్నం !
October 14, 2025
0
Tags