విషాదాంతమైన విహారయాత్ర : మార్కోనహళ్లి ప్రాజెక్ట్‌ వద్ద నీటిలో గల్లంతైన పిల్లలు !

Telugu Lo Computer
0


ర్ణాటకలోని తుమకూరుకు చెందిన కుటుంబం మార్కోనహళ్లి ప్రాజెక్ట్‌ వద్దకు 15 మంది కలిసి విహార యాత్రకు వెళ్లారు. అనంతరం, వారిలో ఒక మహిళ, ఆరుగురు పిల్లలు కలిసి నీళ్లు ఉన్న ప్రాంతం వద్ద ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో, నీటిలో గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు నవాజ్‌ అనే వ్యక్తి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పిల్లలను కాపాడే క్రమంలో నవాజ్‌ కూడా నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెస్య్కూ బృందాలు అక్కడి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశాయి. నవాజ్‌ను మాత్రమే ప్రాణాలతో కాపాడారు. అనంతరం, ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన మహిళ, పిల్లల కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరి పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)