ఢిల్లీ బాబా ముగ్గురు మహిళా సహాయకుల అరెస్టు

Telugu Lo Computer
0


ఢిల్లీ లోని ఒక ప్రైవేట్ ఇనిస్టిట్యూట్ లో 17మంది విద్యార్థినులపై లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ బాబా అకా చైతన్యానంద సరస్వతి ముగ్గురు మహిళా సహాయకులను తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బాబా కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేయడం, బెదిరించడం, లైంగిక కార్యాలకు ప్రేరేపించడం వంటి ఆరోపణలతో శ్వేతా శర్మ (అసోసియేట్ డీన్), భావన కపిల్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), కాజల్ (సీనియర్ ఫ్యాకల్టీ)అనే మహిళలను అరెస్టు చేశారు. చైతన్యానంద సరస్వతి పని చేసిన వసంత కుంజ్ లోని శ్రీశారద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ లో 2016లో చదివిన విద్యార్థి మరిన్ని సంచలన విషయాలను బయటపెట్టాడు. స్వామిజీకి అమ్మాయి నచ్చితే చాలు సౌకర్యాలతో గది లభించేదని తెలిపాడు. అంతేకాదు బ్లాక్ బెర్రీ, ఆపిల్ లాంటి ఖరీదైన ఫోన్లను కూడా ఇచ్చేవాడని చెప్పాడు. దాని తరువాత అమ్మాయిలు వాడుతున్న ఫోన్లను ఆయన కూడా యాక్సెస్ చేసే సౌకర్యం పొందేవాడని.. చాట్ లు, సందేశాలు డిలీట్ చేయగలిగే ఏర్పాట్లు కూడా చేసుకున్నాడని విద్యార్థి తెలిపారు. ఆ ఫోన్లతో ఫ్యామిలీ, బంధువులతో మాట్లాడవద్దని చెప్పేవాడని అన్నాడు. బాబాకు దుబాయ్ షేక్ తో మంచి సంబంధాలు ఉన్నాయని, ఒక అమ్మూయి దుబాయ్ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేశాడని చెప్పుకొచ్చాడు. దుబాయ్, యూఏఈల గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉండేవాడని.. సెక్స్ రాకెట్ గురించి మాత్రం తనకు తెలియదని తెలిపారు. బాబాను అమ్మాయిల తల్లిదండ్రులు బలంగా నమ్మేవారని.. అందుకే ఇనిస్టిట్యూట్ లో చేర్చేవారని, 2016లో చాలా ఘోరాలు జరిగాయని.. ఇప్పుడు మరింత తీవ్రం అయినట్లు తెలుస్తోందని చెప్పుకొచ్చాడు హాస్టల్ వార్డెన్లే దీనంతటికీ కారణమని.. వారే అమ్మాయిలను బాబా దగ్గరకు చేర్చే వారని, దాని తరువాత వారిని బాబా ముగ్గులోకి లాగా అఘాయిత్యాలకు పాల్పడేవాని విద్యార్థి తెలిపాడు. ఇదిలా ఉండగా పోలీసులు కస్టడీలో ఉన్న చైతన్యానంద విచారణలో వారికి సహకరించడం లేదని తెలుస్తోంది. దానికి తోడు తప్పుదో పట్టించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికి కూడా అతనిలో ఎటువంటి షశ్చాత్తాపం కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)