బంగారం కోసం సెవం కపాలం దొంగిలించిన దొంగలు !

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని జల్ గావ్ కు చెందిన ఛాబాబాయి కాశీనాథ్‌ పాటిల్‌ అనే వృద్ధురాలు ఈ నెల 5న మరణించారు. కుటుంబ సభ్యులు సోమవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.ఛాబాబాయి చివరి కోరిక మేరకు ఆమె ఒంటిపై ఉన్న నగలను అలాగే ఉంచి దహనం చేశారు. మంగళవారం ఛాబాబాయి అస్థికల కోసం వెళ్లిన బంధువులు అక్కడి పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. చితిలోని బూడిద చిందరవందరగా పడి ఉండగా, ఎముకలు, కపాలం మాయమయ్యాయి. దీంతో ఛాబాబాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం కోసం దుండగులు ఛాబాబాయి కపాలం, ఎముకలను ఎత్తుకెళ్లారని వారు ఆరోపించారు. శ్మశాన వాటికలో భద్రత కల్పించని మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిలదీశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)