పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లే విమానంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణించారు. ఈ క్రమంలో విమానంలో కో పైలట్‌గా ఉన్న వ్యక్తిని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఆ కో పైలట్ మరెవరో కాదు. బీజేపీకి చెందిన నేత, బీహార్ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ. తనకు ఎదురైన అనుభవాన్ని కేంద్ర మంత్రి చౌహాన్ ఎక్స్ లో షేర్ చేశారు. పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లే ఈ ప్రయాణం తనకు మరవలేనిది అని అన్నారు. ఎందుకంటే ఈ విమానానికి నా ప్రియమైన స్నేహితుడు, ఛప్రా ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ కో పైలట్‌గా ఉన్నారని రాసుకొచ్చారు. మీరు మా హృదయాలను గెలుచుకున్నారు అంటూ ఎంపీ రూడీపై ప్రశంసల వర్షం కురిపించారాయన. విమానంలో ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న ఫొటోలను చౌహాన్ షేర్ చేశారు. అంతేకాదు రూడీని ప్రశంసిస్తూ రాసిన లేఖను కూడా ఎక్స్ లో పెట్టారాయన. రూడీపై కేంద్ర మంత్రి చౌహాన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు అని కితాబిచ్చారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, తమలో ఉన్న ప్రతిభ కోసం సమయం కేటాయిస్తారని మెచ్చుకున్నారు. రాజీవ్ ప్రతాప్ రూడీ బీహార్ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. దీనికి సంబంధించి చౌహాన్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. 'రాజీవ్ ఈ రోజు మీరు మా హృదయాలను గెలుచుకున్నారు. పట్నా నుంచి ఢిల్లీకి వెళ్లే ఈ ప్రయాణం నాకు మరవలేనిది. ఎందుకంటే ఈ విమానానికి నా ప్రియమైన స్నేహితుడు, ఛప్రా ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ కో పైలట్‌గా ఉన్నారు' అని రాసుకొచ్చారు.
కో పైలట్ గా ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీని చూసి ఆశ్చర్యపోయిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ !
October 05, 2025
0
Tags