మైక్రోసాఫ్ట్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్ ఆంత్రోపిక్‌లో సీనియర్ సలహాదారుగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ నియమితులయ్యారు. ఈ రెండు సంస్థలు ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నాయి. సునాక్ ఈ నియామకం ద్వారా మళ్లీ గ్లోబల్ స్టేజ్‌పై తన మేధస్సుతో ప్రభావం చూపే అవకాశం పొందారు. గత జులైలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న సునాక్, ప్రస్తుతం పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతున్నారు.ఈ కొత్త బాధ్యతల గురించి రిషి సునాక్ తన లింక్డ్‌ఇన్ పోస్టులో స్వయంగా వెల్లడించారు. ఈ రెండు పదవుల ద్వారా తనకు లభించే ఆదాయాన్ని మొత్తం తన భార్య అక్షతా మూర్తితో కలిసి ప్రారంభించిన 'ది రిచ్‌మండ్ ప్రాజెక్ట్' అనే ఛారిటీ సంస్థకు విరాళంగా ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఆంత్రోపిక్ సంస్థలో సునాక్ పాత్ర ప్రధానంగా అంతర్గత వ్యవహారాలకు, వ్యూహాత్మక సలహాలకు మాత్రమే పరిమితం కానుంది. ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఆయన కంపెనీకి మార్గనిర్దేశం చేస్తారు. ఇక మైక్రోసాఫ్ట్‌లో కూడా ఆయన ఇదే తరహా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. త్వరలో జరగబోయే మైక్రోసాఫ్ట్ వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.ఈ నియామకాలకు సంబంధించి బ్రిటన్‌లో మాజీ మంత్రులు, ఉన్నతాధికారుల కొత్త ఉద్యోగాలపై నిబంధనలను పర్యవేక్షించే 'అడ్వైజరీ కమిటీ ఆన్ బిజినెస్ అపాయింట్‌మెంట్స్' నిర్దేశించిన షరతులకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు ఆంత్రోపిక్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. నిబంధనల ప్రకారం, రిషి సునాక్ మంత్రి పదవి నుంచి వైదొలిగిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఈ కంపెనీల తరఫున బ్రిటన్ ప్రభుత్వాన్ని లాబీయింగ్ చేయడానికి వీల్లేదు. అలాగే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు తనకు తెలిసిన రహస్య సమాచారాన్ని ఈ పదవుల కోసం ఉపయోగించకూడదని అడ్వైజరీ కమిటీ ఆన్ బిజినెస్ అపాయింట్‌మెంట్స్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.గత జులైలో రిషి సునాక్ ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్‌లో సలహాదారుగా తిరిగి చేరిన విషయం తెలిసిందే. 2000వ దశకం ప్రారంభంలో ఆయన ఇదే సంస్థలో అనలిస్ట్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.
మైక్రోసాఫ్ట్ సీనియర్ సలహాదారుగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ !
October 10, 2025
0
Tags