అమరావతిలో 4 స్టార్ హోటల్ నిర్మించేందుకు దసపల్లా గ్రూపునకు అనుమతి మంజూరు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఓ కార్పోరేట్ హోటల్ కు ఈరోజు అనుమతి మంజూరు చేసింది. దాదాపు 200 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే ఓ ఫోర్ స్టార్ హోటల్ కు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అమరావతితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల వారికి 400 ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని విశాఖలో హోటల్స్ నడుపుతున్న దసపల్లా గ్రూపుకు అమరావతిలో 4 స్టార్ హోటల్ నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అలాగే ఈ హోటల్ కు ఇతర సంస్థల మాదిరిగానే పలు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వబోతోంది. ఇందులో పన్నులు, విద్యుత్ ఛార్జీలతో పాటు పలు మినహాయింపులు ఉన్నాయి. రాష్ట్ర పర్యాటక విధానం ప్రకారం ఈ అనుమతులు ఇచ్చారు. దసపల్లా గ్రూపు అమరావతిలో ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది. దీంతో వీటిని రాష్ట్ర పర్యాటక విధానం కింద ప్రోత్సాహకాలు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులతో పాటు స్టాంప్ డ్యూటీ వందశాతం తిరిగి చెల్లించాలని నిర్ణయించారు. అలాగే పరిశ్రమల తరహాలో విద్యుత్ చార్జీలు వసూలు, ఐదేళ్లకు విద్యుత్ సుంకం తిరిగి చెల్లింపుకు నిర్ణయించారు. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజైయ్ జైన్ పేరిట ఆదేశాలు వెలువడ్డాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)