రూ.201ల లక్కీ డ్రా కూపన్ తో టయోటా ఫార్చ్యూనర్ SUV ని గెలిచిన బాలుడు !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని బర్హాన్‌పూర్‌, అభాపురి ప్రాంతంలో దసరా సందర్భంగా "సర్కార్ ధామ్" ఆధ్వర్యంలో భారీ స్థాయిలో గర్బా ఉత్సవాలు నిర్వహించారు. స్థానికులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లక్కీ డ్రా కూపన్ స్కీమ్ ను కూడా ప్రవేశపెట్టారు. అందులో భాగంగా శిలాంపురకు చెందిన కిరణ్ రాయిక్వార్ అనే మహిళ తన నాలుగేళ్ల మనవడు మేధాన్ష్ పేరుతో రూ.201 చెల్లించి ఒక కూపన్ కొనుగోలు చేశారు. తరువాత రోజు నిర్వహించిన లక్కీ డ్రాలో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ మేధాన్ష్ పేరు ఉన్న కూపన్ విజేతగా ఎంపికైంది. బహుమతిగా టయోటా ఫార్చ్యూనర్ SUV దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దాదాపు రూ. 53 లక్షల విలువైన లగ్జరీ కారు కేవలం రూ.201 తో దక్కించుకోవడం అదృష్టం అని ఆ పిల్లడిని లక్కీ బాయ్ అని అంటూ తెగ పొగిడేస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో లాటరీలపై నిషేధం ఉంది. కానీ సాంస్కృతిక లేదా ధార్మిక ఉత్సవాల సందర్భంగా నిర్వహించే లక్కీ డ్రాలుపై మాత్రం ఆంక్షలు లేవు. అవి పన్ను చెల్లింపులతో, పారదర్శకంగా నిర్వహిస్తే చట్టపరంగా అనుమతించబడతాయి. ఈ గర్బా ఉత్సవం కూడా స్థానిక అధికారుల అనుమతితో జరిగినట్టు చెబుతున్నారు. ఈ సంఘటన తర్వాత మేధాన్ష్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)