తక్కువ ధరలో, మంచి ఫీచర్లతో రియల్‌మీ P3 లైట్ 5G విడుదల !

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లో అనేక మంచి ఫీచర్లతో తక్కువ ధరలో రియల్‌మీ P3 లైట్ 5G విడుదలైంది. ఈ ఫోన్ 6.67-అంగుళాల HD+ 120Hz LCD స్క్రీన్‌తో వస్తుంది. ఇది గేమింగ్ ఆడడానికి, వీడియో చూడడానికి మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ మొబైల్ లో MediaTek Dimensity 6300 SoC ప్రాసెసర్ ఉంది. అలాగే ఇందులో 4GB, 6GB LPDDR4X ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజ్ ఉన్నాయి. అంతేకాకుండా 12GB వరకు డైనమిక్ RAM ఎక్స్‌పాన్షన్ ఫీచర్ కూడా ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI 6.0తో పనిచేస్తుంది. వెనుక భాగంలో 32MP ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. అలాగే ఇది మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా పొందిందని కంపెనీ తెలిపింది. అత్యంత ముఖ్యమైన ఫీచర్లలో ఒకటిగా 6000mAh భారీ బ్యాటరీని చెప్పవచ్చు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. రియల్‌మీ P3 లైట్ 5G పర్పుల్ బ్లోసమ్, మిడ్‌నైట్ లిల్లీ, లిల్లీ వైట్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 10,499 కాగా, 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 11,499గా నిర్ణయించారు. ఈ ఫోన్ సెప్టెంబర్ 22 నుండి ఫ్లిప్ కార్ట్, రియల్‌మీ, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్‌గా వినియోగదారులకు రూ. 1,000 బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)