నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్‌ ఎన్నికలు కొన్ని చోట్ల పూర్తయ్యిన విషయం తెలిసిందే.ఈ ఎన్నికల్లో కూటమి నేతలు భారీ మెజారిటీతో విజయం సాధించారు. దాంతో ప్రభుత్వం దృష్టిని ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకరించింది. ఈ సందర్భంగా నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదన పంపింది.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలకు నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తాం. ఈవీఎంల వినియోగంపై ప్రభుత్వంతో సంప్రదించబోతున్నాం. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈవీఎంలతో ఎన్నికలు జరిగాయి. ఈవీఎంల కొనుగోలు మరియు వినియోగంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)