గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌కు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి శనివారం ఉదయం వచ్చే ఆర్టీసీ బస్సులను నగర శివారు ప్రాంతాలకే పరిమితం చేయనున్నారు. శంషాబాద్ మీదుగా బెంగళూరు, మహబూబ్‌నగర్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ఆరాంఘర్ వద్దనే నిలిపివేయనున్నారు. వరంగల్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ఉప్పల్ వద్ద, విజయవాడ, నల్లగొండ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ఎల్‌బీనగర్ వద్ద నిలిపివేయనున్నారు. వికారాబాద్, మొయినాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మెహిదీపట్నంకు పరిమితం చేయనున్నారు. కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను జేబీఎస్‌లో నిలిపివేయనున్నారు. ఈ రాత్రికి ఎంజీబీఎస్ చేరుకుని, మళ్లీ తెల్లవారుజామున తిరిగి వెళ్లే అంతర్ రాష్ట్ర, జిల్లా బస్సులను చాదర్‌ఘాట్ వైపు దారి మళ్లించనున్నారు.
హైదరాబాద్‌లోకి రేపు ఆర్టీసీ బస్సులకు నో ఎంట్రీ !
September 05, 2025
0
Tags