మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న రెండు కోట్ల ఫోన్‌ కనెక్షన్లు బ్లాక్‌ !

Telugu Lo Computer
0


దక్షిణ గోవాలో డీవోటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం కార్యదర్శి నీరజ్ మిట్టల్వీడియో మాధ్యమంలో ప్రసంగిస్తూ దేశంలో మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న దాదాపు రెండు కోట్లకుపైగా ఫోన్‌ కనెక్షన్లను బ్లాక్‌ చేసినట్లు తెలిపారు. సంచార్ సాథీతో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసినట్టు వెల్లడించారు. దేశ సైబర్ భద్రతను మెరుగుపరిచేందుకు డీవోటీ అనేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రతి రంగంలో టెలికాం పాత్ర పెరిగింది. వినియోగదారుల సంఖ్య పెరిగినట్లే.. ఆర్థిక రంగంలో టెలికాం వనరుల దుర్వినియోగం కూడా పెద్దఎత్తున నమోదవుతోంది. ఈ క్రమంలోనే ఆర్థిక రంగంలో జరుగుతున్న మోసాల గురించి సమాచారాన్ని సేకరించడానికి, ప్రజలకు తెలియజేయడానికి ఆర్థిక సంస్థలకు ఉపకరించే డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను డీవోటీ అభివృద్ధి చేసింది. ఇది సైబర్ సురక్షిత వాతావరణాన్ని అందిస్తుందని మిత్తల్‌ తెలిపారు. అధిక నాణ్యత కలిగిన టెలికాం పరికరాలను అందుబాటులో ఉంచేందుకు టెలికాం టెస్టింగ్‌ ల్యాబ్‌లను పెంచుతున్నాం. కృత్రిమ మేధ సాయంతో మోసపూరిత కనెక్షన్లను తొలగిస్తున్నాం. సైబర్‌ భద్రత విషయంలో ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. ఈ క్రమంలోనే ఇటీవల ప్రవేశపెట్టిన 'ఫైనాన్షియల్‌ ఫ్రాడ్‌ రిస్క్‌ ఇండికేటర్‌'.. మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించే ఫోన్‌ నంబర్లను విజయవంతంగా గుర్తిస్తోంది. డీవోటీ కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థనూ అప్‌గ్రేడ్ చేయనున్నామని మిత్తల్‌ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)