యూరియా కోసం అర్ధరాత్రి నుంచే బారులు తీరిన రైతులు

Telugu Lo Computer
0


తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి రైతువేదిక ఎదుట యూరియా కోసం మంగళవారం అర్ధరాత్రి నుంచే రైతులు బారులు తీరారు. బుధవారం ఉదయం టోకెన్ల కోసం వరుసకట్టిన నేపథ్యంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అసహనానికి గురైన రైతులు వేదికలోకి చొరబడి సామగ్రిని ధ్వంసం చేశారు. కేవలం 1120 యూరియా బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. అన్నదాతలు మాత్రం వేల సంఖ్యలో బారులు తీరారు. ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో దుబ్బాక సీఐ శ్రీనివాస్, ఎస్సై కీర్తి కుమార్, మిరుదొడ్డి ఎస్సై సమతలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసుల సమక్షంలో భారీ బందోబస్తు మధ్య యూరియాను రైతులకు పంపిణీ చేశారు. 3 వేల మంది టోకెన్లు దొరకక నిరాశతో వెనుతిరిగారు. మెదక్ జిల్లా శివ్వంపేట సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం మంగళవారం రాత్రి అక్కడే పడుకొని వేచిచూశారు. బుధవారం ఉదయం టోకెన్ల కోసం బారులు తీరారు. సూర్యాపేట జిల్లాలోని నూతనకల్‌లో యూరియా కోసం రాత్రి నుంచి క్యూలో నిరీక్షించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)