తెలంగాణలో కొత్తగా మద్యం షాపులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతి నాలుగేళ్లకోసారి మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు జారీ చేయడం రాష్ట్ర పాలసీగా కొనసాగుతుంది. ఈసారి కూడా ప్రభుత్వం అదే విధానాన్ని అనుసరించి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కలిగిన వ్యాపారులు, కాంట్రాక్టర్లు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం రేపటి నుంచి అక్టోబర్ 18 వరకు.. దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ సమయంలో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఎవరైనా అర్హత కలిగిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం అందిన దరఖాస్తులను పరిశీలించి, పారదర్శకంగా అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో షాపుల కేటాయింపు జరగనుంది.
కొత్త మద్యం షాపుల కోసం నోటిఫికేషన్ విడుదల !
September 25, 2025
0
Tags